అధికార పార్టీ నేత కొడుకు అహంకారం...!

21-09-2026 | 07:55pm
  1. పంచాయతీ కార్యదర్శి పై చేయి చేసుకున్న వైనం
  2. బిల్లులు చేయాలంటూ కార్యదర్శి పై దాడి
  3. పంచాయతీ సిబ్బంది ముందే దౌర్జన్యం
  4. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

పినపాక, సెప్టెంబరు 21,(విజయ క్రాంతి): పంచాయతీ బిల్లులు చేయాలంటూ పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary) పై అధికార పార్టీ నేత కొడుకు చేయి చేసుకున్న ఘటన మండలంలోని జానంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జానంపేట పంచాయతీ కార్యదర్శి ఖాజా హుస్సేన్ పంచాయతీ కార్యాలయంలో తన విధుల్లో ఉండగా, ఏడూళ్ళ బయ్యారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గంగిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు గంగిరెడ్డి నిశాంత్ రెడ్డి తను చేసిన పనులకు బిల్లులు చేయాలంటూ లేకపోతే నీ అంత చూస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

అంతేకాకుండా కార్యదర్శి పై దుర్భాషలాడుతూ, సిబ్బంది ముందే చెయ్యి కూడా చేసుకున్నాడు. ఈ విషయంపై బాధితుడు ఖాజా హుస్సేన్ ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు  కార్యదర్శి ఖాజా హుస్సేన్ తెలిపారు. నిశాంత్ రెడ్డి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు