తండ్రి లేని పేదింటి ఆడపిల్ల వివాహానికి ఉప్పల ఫౌండేషన్ అండ
పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్న ఉప్పల
పుస్తె మట్టెలు, చీర, గాజులు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
నాగోల్: తండ్రి లేని పేదింటి దళిత సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్ల వివాహానికి ఉప్పల ఫౌండేషన్ అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా(Siddipet District) నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవ్‌పల్లి గ్రామానికి చెందిన గుండెల్లి యాదమ్మ– కిషన్ దంపతుల కుటుంబానికి చెందిన ఆడపిల్ల వివాహం సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ తరఫున చీర గాజులు పూస్తే మట్టెలు అందజేశారు. నాగోల్‌లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో(Uppala Srinivas Gupta) నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల ఫౌండేషన్ చైర్మన్(Chairman of the Uppala Foundation) ఉప్పల శ్రీనివాస్ గుప్త స్వయంగా వధువుకు పుస్తె మట్టెలు, చీర, గాజులు అందజేసి, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో వివాహం చేసుకోలేని పేద కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం ఉప్పల ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తండ్రి లేని ఆడపిల్ల వివాహానికి అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో, అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ఫౌండేషన్ కో చైర్మెన్ ఉప్పల స్వప్న గారు, లక్ష్మి దేవ్ పల్లి గ్రామానికి చెందిన యువజన సంఘం నాయకుడు కనక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.