5 September, 2026 | 10:09 PM

ఆయిల్‌పామ్‌లో మినుము సాగుపై క్షేత్ర ప్రదర్శన

05-09-2026 | 08:27pm

రాయికోడ్,(విజయక్రాంతి): శంషోద్దీన్పూర్ గ్రామం(Shamshoddeenpur village)లో ATMA ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ తోటలో అంతర పంటగా మినుము సాగుపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు, నానో DAP, నానో యూరియా వినియోగంపై వ్యవసాయ(Agriculture) అధికారులు అవగాహన కల్పించారు. ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా మినుము సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సారిక, AEO మమత, ATM రమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు