జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవకతవకలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసన
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసనకు దిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో, లక్కీ డ్రా నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) మాట్లాడుతూ.. పేదల కోసం కేసీఆర్(KCR) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను(Double bedroom houses) కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు పంచే ప్రయత్నం చేస్తోంది.
అర్హులైన పేదల పేర్లను తొలగించి, అనర్హులకు ఇచ్చేందుకు లక్కీ డ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారు. అని విమర్శించారు. అసలైన అర్హుల జాబితాను బయటపెట్టాలి. గ్రామసభల్లో విచారణ జరిపి ఇళ్లు కేటాయించాలి. లక్కీ డ్రాను వెంటనే నిలిపివేయాలి" అని డిమాండ్ చేశారు. ఆయన నిరసనతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు.






