విష్ణువర్ధన్ రెడ్డిని కలిసిన ఎల్లారెడ్డి
05-09-2026 | 08:14pm
తాడ్వాయి,(విజయక్రాంతి): బిజెపి జాతీయ సెల్స్ సంయుక్త సమన్వయకర్త(Joint Coordinator of BJP National Cells)గా ఇటీవల నియమితులైన విష్ణువర్ధన్ రెడ్డిని శనివారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం దేవాయిపల్లి కి చెందిన సీనియర్ బిజెపి నాయకులు ఎల్లారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఉన్నట్లు ఎల్లారెడ్డి తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలపై చర్చించినట్లు ఎల్లారెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






