పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్?

23-09-2026 | 09:51am

సిద్దిపేటపేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి(Former MLC Koora Raghotham Reddy) అరెస్ట్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా(Block Office Junction) సమీపంలోని ఆయన నివాసంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సమాచారం మేరకు.. పేకాట ఆడుతున్న స్థావరంపై టూటౌన్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.

ఈ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రఘోత్తరంరెడ్డితో పాటు ఐదుగురిని టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు(Two-Town Police Station) తరలించినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ అరెస్ట్ సిద్దిపేటలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, అరెస్ట్‌కు సంబంధించిన తదుపరి వివరాలు తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు