4 September, 2026 | 8:59 AM

బాకీకార్డు పేరుతో దుష్ప్రచారం

04-09-2026 | 04:50am

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, సెప్టెంబర్ 3, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ చేపడుతున్న ‘బాకీ కార్డు’ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) విమర్శించారు. తెలంగాణకు బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని,  కల్వకుంట్ల కుటుంబం, బీఆర్‌ఎస్ పార్టీయేనని ఆరోపించారు.

కా ంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం వేములవాడలో సుమారు 500 మీటర్ల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మా ట్లాడారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం భారీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించా రు. 2014లో సుమారు రూ.75 వేల కోట్లుగా ఉ న్న రాష్ట్ర అప్పులు బీఆర్‌ఎస్ పాలన ముగిసే నా టికి గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

తె లంగాణ ఉద్యమ నినాదంతో అధికారంలోకి వ చ్చిన బీఆర్‌ఎస్, అనంతరం పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకుని తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుందని విమర్శించా రు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గత 1000 రోజుల్లో పూర్తిగా విఫలమయ్యారని ఆది శ్రీనివాస్ అన్నా రు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించకుండా ఫామ్హౌస్కే పరిమితమయ్యారని విమ ర్శించారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించలేకపోతే ఆ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

120కి పైగా కార్యక్రమాలుముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిర మ్మ ఇళ్లు తదితర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు.మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, ఫోర్త్ సిటీ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృ షి చేస్తోందన్నారు.ఇది ఫామ్హౌస్ పాలన కాదనీ, ప్రజా పాలన అని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే 500 మీ టర్ల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇం దిరమ్మ రాజ్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.