మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

20-09-2026 | 06:06pm

ఆలేరు, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినా(Modis birthday)న్ని పురస్కరించుకుని బీజేవైఎం భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ ఆర్ కాలేజీ సమీపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో 76 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాయ దశరథ, పట్నం శ్రీనివాస్, పద్మతి జగన్మోహన్ రెడ్డి, దయ్యాల కుమార్, రత్నపురం బలరాం, బండారి స్వర్ణలత, యాస్మి, న్నలమాస్ వెంకటేశ్వర్లు, మాధురి చంద్ర, గాయపాక పృథ్వీ, ఉదుత భాస్కర్, కృష్ణాచారి, సూర్వి శ్రీనివాస్, రమేష్ కోటి, డా. జె. భరత్, బట్టు క్రాంతి, రత్నపురం ప్రవీణ్, బొల్లారం మధు, రావుల సంతు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు