ఆహారం కలుషితమైందా?..విద్యార్థినులకు అస్వస్థత

08-10-2026 | 04:58pm

వనపర్తి: పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నిన్న కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తూ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు