ప్రధాని మోడీతో రష్యా అధ్యక్షడు పుతిన్ భేటీ
11-09-2026 | 04:29pm
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Modi)తో రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్‌కు తమిళ ఆదిగ్రంథాన్ని బహుకరించారు. భారత్–రష్యా మధ్య దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం, కీలక రక్షణ ఒప్పందాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.