రాజకీయాల్లోకి లేడీ సూపర్‌స్టార్?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ (Thalapathy Vijay) ప్రభావం పెరగడంతో సినీ ప్రముఖుల రాజకీయ ప్రవేశాలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో నటి నయనతార కూడా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. తాజాగా ఈ అంశంపై ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ స్పందించారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడంతో పలువురు సినీ ప్రముఖుల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. నటి త్రిష, నటులు ధనుష్, శివకార్తికేయన్, విశాల్‌తో పాటు నయనతార పేరు కూడా రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న చర్చల్లో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) సమాధానమిచ్చారు. ప్రస్తుతం నయనతార మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారని, తమ సమయాన్ని పిల్లలు, కెరీర్‌పై కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ జీవితం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. విఘ్నేశ్ శివన్ వ్యాఖ్యలతో నయనతార రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మరోసారి చర్చ మొదలైంది. అయితే, ఆమె రాజకీయాల్లోకి వస్తారనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.