స్మగ్లింగ్ ఇలా ట్రై చేశాడు.. దొరికిపోయాడు!

13-10-2026 | 11:16am

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) బంగారం స్మగ్లింగ్‌ యత్నాన్ని కస్టమ్స్‌ అధికారులు భగ్నం చేశారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 241 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.35.21 లక్షలుగా అంచనా వేశారు. అధికారుల తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల మూలల్లో వైర్ల రూపంలో బంగారం దాచినట్లు గుర్తించారు.

సాధారణంగా కనిపించేలా బ్యాగుల్లో అమర్చిన బంగారాన్ని పరిశీలనలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్‌ చట్టం (Customs Act) కింద సీజ్‌ చేశారు. బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. స్మగ్లింగ్‌ యత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు