‘సర్’లో మిస్సయిన ఓటర్ల రీ ఎంట్రీకి స్పెషల్ డ్రైవ్
- కొత్తగా అర్హత పొందినవారి పేర్లూ నమోదు
- కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
- ఓటర్ల నుంచి ఫామ్-6 స్వీకరణ.. నెలరోజుల ప్రక్రియ
- ‘సర్’ ముగిసిన రాష్ట్రాల్లో అమలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ‘సర్’పై వివాదాలు చెలరేగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్త జాబితాలో పేర్లు గల్లంతై నవారిని గుర్తించి తిరిగి చేర్చేందుకు, అర్హత ఉన్న కొత్తవారి పేర్లను నమో దు చేయించేందుకు స్పెషల్ డ్రైవ్(Special Drive) చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. సర్ ప్రక్రియలో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం దక్కనంత మాత్రానా అర్హులైన పౌరులు జాబితాలో చోటు కోల్పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఓటరు నమో దు నిరంతర ప్రక్రియ అని పేర్కొంది.
జనం వద్దకు బీఎల్వోలు
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) జనం దగ్గరికి రానున్నారు. ఇల్లిల్లూ తిరగనున్నారు. అంతకంటే ముందు రెండు జాబితాలను పరిశీలిస్తారు. ‘సర్’కు ముందు ఉన్న ఓటర్ల జాబితాను(Voter List), ప్రస్తుతం ఉన్న జాబితాను పోల్చి.. పాత లిస్టులో పేర్లు ఉండి, కొత్త లిస్టులో కనిపించని వారిని గుర్తిస్తారు. అలాంటి వారి ఇంటికి బీఎల్వోలు వెళ్లి వివరాలను తనిఖీ చేస్తారు.
అర్హత పొందిన యువ ఓటర్లు, సవరించిన జాబితాలో పేర్లు గల్లంతైన వారినుంచి ఫామ్ 6ను తీసుకుంటారు. అనంతరం వివరాల కాపీని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్‌ఏల)కు అందజేస్తారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ప్రతి బీఎల్వో వారానికి 20 నుం చి 25మంది ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. నెలరోజుల్లో ఈప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్ ఉంటుం ది. ‘సర్’ ముగిసిన రాష్ట్రాల్లో దీన్ని చేపట్టనున్నారు.
విమర్శల నేపథ్యంలో..!
నచ్చని ఓటర్ల పేర్లు తొలగించేందుకే కేంద్రం ‘సర్’ ప్రక్రియను చేపట్టిందని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, ‘సర్’ను నిలిపివే యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వారం రోజుల ఉద్యమానికి కూడా శ్రీకారం చు ట్టాయి. ఈ క్రమంలో ఈసీ స్పెషల్ డ్రైవ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సర్ పూర్త యిన ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేర్లు దక్కనివారిని గుర్తించడంతోపాటు కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్ల నమోదును సులభతరం చేయడమే స్పెషల్ డ్రైవ్ ఉద్దేశమని ఈసీ తెలిపింది.