బ్రేక్ ఫాస్ట్‌కు కార్పొరేట్ సంస్థల చేయూత

03-10-2026 | 05:20am

నాగర్ కర్నూల్, వికారాబాద్‌లలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు

హెచ్‌కేఎంసీఎఫ్ మధ్య జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఒప్పందం

హైదరాబాద్, అక్టోబర్ 2(విజయక్రాంతి) : విద్య, పిల్లల పోషకాహారాన్ని మెరుగుపరిచే దిశగా ఒక అద్భుతమైన అడుగు పడిం ది. హరే కృష్ణ మూవ్ మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్(Hare Krishna Movement Charitable Foundation) (హెచ్‌కేఎంసీఎఫ్)ప్రముఖ సంస్థలైన జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటె డ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో(Chain Labs India Private Limited) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇం దులో భాగంగా నాగర్ కర్నూల్(Nagarkurnool), వికారాబాద్‌లలో(Vikarabad) ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను(Modern centralized community kitchens) ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో ఆకలిని నివారించి, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాల(Government school) పిల్లలకు పరిశుభ్ర మైన, పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందిస్తోంది.

ఆ దిశగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య మైన మైలురాయిగా నిలవనుంది. ఈ రెండు సంస్థలు కలసి అందించిన రూ.9.17 కోట్లఉమ్మడి విరాళంతో రెండు ప్రాంతాల్లోని ప్రభు త్వ పాఠశాల పిల్లలకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ వండి అందించే అత్యాధునిక, అధిక సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేయను న్నారు. తెలంగాణలో ఏ చిన్నారి కూడా ఆకలి కారణంగా విద్యకు దూరం కాకూడదనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎమ్‌డీ శేఖర్‌రెడ్డి స్వస్థలమైన నాగర్ కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూ నిటీ కిచెన్ ఏర్పాటు కోసం ఆ సంస్థ రూ. 5.17 కోట్ల చెక్కును అందిస్తూ హెచ్‌కేఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ కిచెన్ ద్వారా నాగర్ కర్నూల్ జి ల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 50వేలమంది పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందుతుంది. ఢిల్లీకి చెందిన చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వికారాబాద్ లోసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు కోసంరూ. 4 కోట్ల చెక్కును అందజేసింది.

ఈ కిచెన్ ద్వారా వికారాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన20వేల మంది పిల్లలకుపౌష్టికాహారంతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించబడుతుంది. శుక్రవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎమ్‌డీ శేఖర్‌రెడ్డి, బి.అనిల్‌బాబు, సీఈవో అండ్ డైరెక్టర్, జున్నాసోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సుమంతడే - వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్పాలసీ కలసి చెక్కులను హెచ్‌కేఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్ర దాస స్వామీజీకి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా  ఆయా పరిశ్రమలను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.

మరిన్ని వార్తలు