6 September, 2026 | 10:17 AM

సరికొత్త ప్రపంచ పటం

06-09-2026 | 05:25am
  1. ఆఫ్రికా పెద్దగా, అమెరికా చిన్నగా
  2. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదం
  3. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టోగో
  4. భారత్‌తో సహా 164 దేశాలు అనుకూలంగా ఓట్లు 
  5. ఓటింగ్‌కు దూరంగా ఆరు కంట్రీలు
  6. అమెరికా మాత్రమే వ్యతిరేకంగా ఓటు
  7. ప్రఖ్యాత మార్కరేట్ వరల్డ్‌మ్యాప్‌నకు స్వస్తి

వాషింగ్టన్, సెప్టెంబర్ 5: ఖండాల భూభాగాలకు ‘మరింత కచ్చితమైన ప్రాతినిధ్యం‘ కల్పించేందుకు ప్రపంచ పటాన్ని సరిది ద్దే లక్ష్యంతో యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌తో సహా 164 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 193 మంది సభ్యులున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ (UAN General Assembly) శుక్రవారం ‘పటాన్ని సరిదిద్దండి’, ప్రపంచ పట ప్రాతినిథ్యాన్ని పునఃసమతుల్యం చేయడం, ప్రపం చంలోని ప్రాంతాలకు, ముఖ్యంగా ఆఫ్రికాకు సమాన ప్రాతినిథ్యాన్ని ప్రోత్సహించడం’ అనే తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించిం ది.

ఈ తీర్మానాన్ని టోగో దేశం ప్రవేశపెట్టింది. 164 దేశాలు అనుకూలంగా ఓట్లు వేయగా, ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరి కా మాత్రమే వ్యతిరేకంగా ఓటేసింది. ఈ ఆధునిక వరల్డ్‌మ్యాప్‌లో ఆఫ్రికా పెద్ద పరిమాణంలో, అమెరికా చిన్నగా ఉండడం గమనా ర్హం. దేశాల భౌగోళిక సరిహద్దులు, ఖండాల పరిమాణంపై శతాబ్దాలుగా ప్రాచూర్యంలో ఉన్న మార్కరేట్ వరల్డ్ మ్యాప్‌నకు ఐక్యరాజ్య సమితి స్వస్తి చెప్పింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ పటాన్ని సరిదిద్దే తీర్మానాన్ని టోగో ప్రవేశపెట్టింది.

దానికి అనుకూ లంగా 164 ఓట్లు వచ్చాయి. ఎస్టోనియా, జార్జియా, లిథువేనియా, మోల్డోవా, సెర్బియా, ఉక్రెయిన్ దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా, అమెరికా దేశం మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేసింది. పాకిస్తాన్ కూడా అనుకూలంగా ఓటు వేసింది. 16వ శతాబ్దంలో నావిగేషన్ ప్రయో జనాల కోసం రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్, భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ఉత్తర, దక్షిణ ప్రాంతాల భూభాగాలను గణనీయంగా వక్రీకరించినప్పటికీ, విద్యా, మీడియా, డిజిటల్, అధికారిక సామగ్రిలో ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగించబడుతోందని ఆ తీర్మానం పేర్కొంది.

‘ఈ వక్రీకరణ ఆఫ్రికా, లాటిన్ అమెరికాతోపాటు దక్షిణాసియా వాస్తవ పరిమాణాలను తగ్గించి చూపడానికి, ప్రపంచంపై అసమతుల్య దృక్పథాన్ని శాశ్వతం చేయడానికి దోహదపడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది. చరిత్ర నుంచి సంక్రమించిన ఖండాల పరిమాణాల పట చిత్రణ వక్రీకరణలు జ్ఞానాత్మక, విద్యా, సాంస్కృతిక, భౌగోళిక-రాజకీయ, సామాజిక-,

ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటా యని, చారిత్రక పక్షపాతాలుగా పరిగణించబడతాయని ఈ తీర్మానం ధ్రువీకరించింది. ఈక్వల్ ఎర్త్ పట చిత్రణ ప్రక్షేపణం ఖండాల భూభాగాల పరిమాణాలను మరింత కచ్చితంగా సూచిస్తుందని ప్రకటించింది. 

భారత్ స్వాగతిస్తోంది

జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌పై ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి రఘూ పూరి వివరణ ఇచ్చారు. మరింత కచ్చితమైన, ప్రాతినిథ్య పట నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించాలనే తీర్మానం వెనుక ఉన్న ఉద్దేశాన్ని భారతదేశం ‘స్వాగతిస్తుందని’ తెలిపారు. ‘ఈ తీర్మానాన్ని ‘ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్’ లేదా మరే ఇతర నిర్దిష్ట మ్యాప్ ప్రొజెక్షన్‌ను ఆమోదించేదిగా కాకుండా, ‘ఈక్వల్ ఏరియా మ్యాప్ ప్రొజెక్షన్ల’ విస్తృత వినియోగానికి, పరిశీలనకు మద్దతు ఇచ్చేదిగా అర్థం చేసుకోవాలి’ అన్నారు.

ఖండాంతర భూభాగాల సాపేక్ష పరిమాణాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఉండే ‘సమాన విస్తీర్ణ’ విధానాలను ప్రోత్సహించే సూత్రానికే భారత్ వైఖరి అన్నారు. అందుకే ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశామని ఆయన పేర్కొన్నారు. 

ఇది అమెరికాకు పట్టిన పీడ!

ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తూ, ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలికి అమెరికా డిప్యూటీ ప్రతినిధి యరీనా ఫెరెన్సెవిచ్ మాట్లాడారు. ఇలాంటి తీర్మానాలు, అవి ప్రోత్సహించే సైద్ధాంతిక ఎజెండాలు ఇక్కడ తాము చేస్తున్న పనికి పట్టిన పీడలా ఉన్నాయి. ఈ సంస్థ తన విశ్వస నీయతను కోల్పోవడానికి ఇవే కారణం. ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి తన చట్టబద్ధతను ఎందుకు కోల్పోతోందని, తనను ఎందుకు తీవ్రం గా పరిగణించడం లేదని పదేపదే ప్రశ్నించుకున్న ప్పుడు, తాము ఇలాంటి తీర్మానాలనే ఉదాహరణగా చూపిస్తాం’ అని అన్నారు.


మరిన్ని వార్తలు