పిట్టంపల్లిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

18-09-2026 | 12:11pm

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా(Nalgonda District) చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో విగ్నేశ్వరా యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను(Vinayaka chavithi celebrations) శుక్రవారం భక్తిశ్రద్ధలతో మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ(Congress Party) యువనాయకుడు వేముల విపుల్ ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గణేశుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పిట్టంపల్లి గ్రామ ఉప సర్పంచ్ నారగోని నాగరాజు యాదవ్, విగ్నేశ్వరా యూత్ సభ్యులు, గ్రామ యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు