అమ్మవారికి బంగారు ఆభరణాలు
18-09-2026 | 01:27pm
అమీన్ పూర్: అమీన్ పూర్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం(Sri Bhramaramba Mallikarjuna Swamy Temple)లో కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి భక్తులు మూడు తులాల బంగారు ఆభరణాలు(Gold jewelry) కానుకగా సమర్పించారు. రెయిన్బో మెడోస్, బీరంగూడకు చెందిన వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో ఈ బంగారు అభరణాల ను అమ్మవారికి సమర్పించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అభినందించారు.