''మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా''! రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపరాఫర్

18-09-2026 | 12:00pm

రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో

ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతా?.. వెయ్యి కోట్లు ఇవ్వు చాలు

హైదరాబాద్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. ఏం చేయలేవని మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) తేల్చిచెప్పారు. నాంపల్లి కోర్టులో(Nampally Court) ఫార్ములా-ఈ కేసు విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్(Bharat Rashtra Samithi)లోని నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని కేటీఆర్ ద్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అమలుపై కాకుండా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబం రూ. లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం ఆరోపించారని తెలిపారు. 'రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇస్తున్నా.. మా ఆస్తులు తీసుకుని వెయ్యి కొట్టు ఇవ్వు చాలు.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా' అన్నారు. లక్ష కోట్లతో మిగిలిన రూ. 99 వేల కోట్లతో పథకాలు అమలు చేయమని సూచించారు.

పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తే తమపై కేసులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు 70 కిలో మీటర్ల దూరంలో కేసీఆర్(KCR)  అప్పట్లో ఎకరా రూ. 5 లక్షల చొప్పున  భూమి కొన్నారని సూచించారు.  వెయ్యి ఎకరాలు కేసీఆర్ దోచుకున్నారని గతంలో అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ కు 67 ఎకరాలే ఉన్నాయని రేవంత్ రెడ్డే చెప్పారని వివరించారు. కాగా, ఫార్ములా -ఈ రేస్ కేసులో(Formula E race case) తదుపరి విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు కేటీఆర్ తో పాటు అరవిద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు