తెలంగాణ అసెంబ్లీలో ఎల్ నినో ప్రభావంపై చర్చ
18-09-2026 | 08:40am
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ఎల్ నినో(El Nino) ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ నినోపై సభలో చర్చను ప్రారంభించనున్నారు. చర్చల అనంతరం మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. రేపు కూడా తెలంగాణ అసెంబ్లీ కొనసాగనుంది.