తిరుమలలో భక్తుల రద్దీ.. వసతి తాజా సమాచారం ఇదే!

18-09-2026 | 08:29am

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని  ఆలయ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 68,265 మంది భక్తులు దర్శించుకోగా,26,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. అటు 3వ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది. భక్తి, సంప్రదాయాలను చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాల నడుమ శ్రీ మలయప్ప స్వామి ఉదయం సింహవాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులను ఆశీర్వదించారు.

తిరుమల వసతి తాజా సమాచారం:

18-09-2026 | ఉదయం 7:12 గంటలకు

రూ.50 & రూ.100 గదులు : 226 అందుబాటులో ఉన్నాయి

రూ.1,000 & రూ.1,523 గదులు : 14 అందుబాటులో ఉన్నాయి

మరిన్ని వార్తలు