GO No.3 రద్దుపై అసెంబ్లీలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గళం

18-09-2026 | 01:50pm

గిరిజనుల హక్కులపై రాజీ లేదు.. ప్రత్యేక అవకాశాలను పునరుద్ధరించాలి

ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ(Telangana Legislative Assembly)లో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) GO No.3 రద్దు అంశాన్ని గిరిజనుల తరఫున బలంగా ప్రస్తావించారు. GO No.3 కేవలం ఉద్యోగాలు, విద్యకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిధిలో గిరిజనుల ప్రయోజనాలకు సంబంధించిన మరిన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. GO No.3తో పాటు ఇతర నిబంధనలు, సుమారు 29 రకాల GOలు రద్దు కావడంతో గిరిజన ప్రాంతాల ప్రజల హక్కులు, అవకాశాలపై ప్రభావం పడుతోందని అన్నారు.

గిరిజన యువతకు 75% పోలీస్ ఉద్యోగాలు

తెలంగాణలోనూ ప్రత్యేక అవకాశం కల్పించాలి

షెడ్యూల్డ్ ప్రాంతాల స్థానిక గిరిజన యువతకు ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో గిరిజన ప్రాంతాల యువతకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా గిరిజన ప్రాంతాల ఆదివాసీ యువతకు 75 శాతం పోలీస్ ఉద్యోగాల అవకాశం కల్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో కూడా అదే విధంగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ని కోరినట్లు తెలిపారు.

గిరిజన ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

 గిరిజన ప్రాంతాల్లో ఎదురవుతున్న ఫారెస్ట్, రెవెన్యూ సమస్యలు, విద్యుత్ స్తంభాల మార్పిడి, పారిశుద్ధ్యం, రెవెన్యూ సర్టిఫికెట్ల జారీ వంటి సమస్యలను కూడా ఎమ్మెల్యే  సభ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన ప్రాంతాల ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, హక్కులు, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు