ఫ్రోబెల్ పూర్వ విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు

18-09-2026 | 01:36pm

గణపురం,(విజయక్రాంతి): నారాయణగిరిపల్లి గ్రామానికి చెందిన బండి గట్టు స్వామి,వినోద దంపతుల కుమార్తె, ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్ పూర్వ విద్యార్థి(Froebel Model High School Alumni)ని బండి ప్రియమణి జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల(Jagityala Government Medical College)లో ఎంబీబీఎస్ సీటు(MBBS seat ) సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ల్యాదల్ల, కృష్ణ, గౌడ్ కరస్పాండెంట్ పబ్బ శివశంకర్, గౌడ్ డైరెక్టర్లు ఎస్. జగన్‌రెడ్డి, ల్యాదల్ల యాదగిరి గౌడ్, వెల్తుర్లపల్లి ఉపసర్పంచ్ సలువాది సుప్రియ, ఉపాధ్యాయ బృందం ప్రియమణిని, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రియమణి పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషితో ఈ విజయాన్ని సాధించిందని, ఆమె విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. తన విజయానికి పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, ప్రోత్సాహం ఎంతో దోహదపడ్డాయని ప్రియమణి పేర్కొంది. భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని పాఠశాల యాజమాన్యం ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు