పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

01-11-2026 | 10:08pm

ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నమోదు శిబిరం

మునుగోడు, నవంబర్ 1 (విజయక్రాంతి): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్(ELV Bhaskar Foundation) టీం సభ్యులు పందుల రవితేజ పిలుపునిచ్చారు. ఫౌండేషన్ అధినేత భాస్కర్ సూచన మేరకు ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టభద్రుల ఓటరు నమోదు శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ బృందం సభ్యుడు రవితేజ మాట్లాడుతూ... గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న పట్టభద్రులు సైతం మరోసారి నమోదు చేసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఓటరు నమోదు ప్రక్రియ చేపడుతున్నామని, పట్టభద్రులకు అవసరమైన సహకారం అందించేందుకు బృంద సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాపోలు నవీన్‌కుమార్, వరికుప్పల ముత్యాలు, కృష్ణ, వీరస్వామి, మేడి అఖిల్, స్వామి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు