ఉద్యమకారుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేయాలి

19-09-2026 | 10:02pm

తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమ(Telangana Malidasa Movement) స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఉద్యమకారుల సంక్షేమం, హక్కులు, గౌరవం కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల మండలం తాళ్లవెల్లాంల గ్రామానికి చెందిన జోగు లింగస్వామి మాదిగను నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరంతరం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో సంఘం కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జోగు లింగస్వామి మాదిగను కోరారు. జోగు లింగస్వామి మాదిగ ఉద్యమకారుల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన నియామకంతో నల్లగొండ జిల్లాలో సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు