జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఘనంగా మహా అన్న ప్రసాద వితరణ

19-09-2026 | 11:58pm

కార్యక్రమంలో పాల్గొన్న సూపరింటెండెంట్ వెంకటరత్నం

భూపాలపల్లి,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గణపతి నవరాత్రి ఉత్సవాలను(Ganapathi navratri celebrations) పురస్కరించుకుని శనివారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొదటగా ఆసుపత్రి ఆవరణలో కొలువైన గణనాథుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సిబ్బంది ఐక్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. 

మరిన్ని వార్తలు