పెద్ద ఎత్తున లంబాడీలు తరలి రావాలి
బిజినేపల్లి, నవంబర్ 24 : ఈ నెల 26వ తేదీన గురువారం రోజు నల్లమల్లలోని మద్దిమడుగు వద్ద రూ.159 కోట్లతో 20 ఎకరాలలో శ్రీ సంత్ సేవలాల్ విగ్రహ(Statue of Shri Sant Sevalal) ప్రతిష్ఠాపన భూమి పూజ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న లంబాడీలు పెద్ద ఎత్తున తరలి రావాలని గిరిజన సర్పంచులు, మండల నాయకులు కోరారు.
మంగళవారం మండల కేంద్రంలో సమావేశమైన గిరిజన నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాయకత్వంలో నాగరుకర్నూల్ నియోజక వర్గం నుండి పెద్ద ఎత్తున లంబాడీలు సిద్ధం చేయాలని, అందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు కేతావత్ మాన్యనాయక్, మూడావాత్ గోవిందునాయక్, చందూలాల్ నాయక్, హన్మ్యనాయక్, లక్ష్మణ్ నాయక్, పాండు నాయక్, రవినాయక్ గోపాల్, నర్సింగ్ నాయక్, పాండు నాయక్, అమర్ నాయక్, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.