ఈతలోనే భక్తి చాటిన స్విమ్మర్..
చేతులపై కార్తీక దీపం
మధిర, నవంబర్24 (విజయక్రాంతి): మధిర స్విమ్మర్స్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ మాజీ చైర్మన్ సేవాసమితి ఉపాధ్యక్షులు స్విమ్మింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు స్విమ్మింగ్ కోచర్ చల్లా సత్యనారాయణ(Challa Satyanarayana) కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీకదీపం వెలిగించుట జరిగింది.
ప్రత్యేకత: ఏరులో ఏ ల్లకిలా పడుకుని రెండు చేతులు చాపి ఆ రెండు చేతులలో ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి విన్యాసాలు చేశారు భక్తి పరవశంతో శివుని స్మరిస్తూ చాలాసేపు కార్తీకదీపం వెలిగిస్తూ ఉండిపోయారు. వీరు ఈత నేర్పడంలో ప్రాముఖ్యత ఉన్నది, కులమత బేధం లింగ బేధం లేకుండా చిన్న పెద్ద అందరికీ నేర్పిస్తారు. కరోనా టైములో వాసవి క్లబ్ ఆధ్వర్యంలోఎన్నో సేవలు చేసినారు ఆ సేవలు మరువలేనివి.ఈ కార్యక్రమంలో మధిర స్విమ్మింగ్ మిత్రులు పాల్గొన్నారు.