టాటా హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ (Bad News). ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు (Automobile Companies) టాటా మోటార్స్, హ్యుందాయ్ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ముడి సరుకుల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు (Manufacturing Costs) అధికం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ తన పెట్రోల్, డీజిల్, CNG కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను సగటున 0.5 శాతం పెంచింది.
మరోవైపు హ్యుందాయ్ కూడా ఎంపిక చేసిన కార్ల మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచింది. ఆయా వాహనాలపై గరిష్ఠంగా రూ.8,000 వరకు ధరలు పెరగనున్నాయి.
ఇప్పటికే పెరుగుతున్న కార్ల ధరలు, నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఈ నిర్ణయం మరింత భారంగా మారనుంది. కొత్త కారు కొనాలనుకునే వారు డిసెంబర్ 1లోపు కొనుగోలు చేస్తే పాత ధరల ప్రయోజనం (Old Price Benefit) పొందే అవకాశం ఉంటుంది. అయితే మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉండనున్నాయి.