టిఏజిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా గౌరి నాగేశ్వరరావు, కారం పుల్లయ్య
ములకలపల్లి, నవంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా మూడవ మహాసభ లో 35 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా గౌరి నాగేశ్వరరావు,కారం పుల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ములకలపల్లిలో నిర్వహించిన జిల్లా మహాసభలో ఎన్నుకున్న జిల్లా కమిటీ వివరాలను వారు మంగళవారం ఇక్కడ తెలిపారు. వీరితోపాటు మరో 15 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రెండోసారి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికచేసిన రాష్ట్ర కమిటీకి,జిల్లా నూతన కమిటీకి మహాసభలో హాజరైన ప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఐదోవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.
1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3ని ఆర్డినెన్స్ ద్వారా పునరుద్ధరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.వీరితోపాటు ఉపాధ్యక్షులుగా సరియం కోటేశ్వరరావు, పాయం నరసింహారావు, దుబ్బా గోవర్ధన్, సోడెం ప్రసాద్, మడి నరసింహారావు,వీళ్ళతోపాటు సహాయ కార్యదర్శులుగా సున్నం గంగా మడివి రమేష్ కారం నరేష్ కొమరం కాంతారావు మడి సురేష్ కోశాధికారిగా సోయం జోగారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.