రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పెర్కబండ విద్యార్థి ఎంపిక

24-11-2026 | 05:48pm

బెజ్జంకి,విజయక్రాంతి: మండలంలోని పెర్కబండ గ్రామానికి చెందిన వడ్లూరి రిశ్విత్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు(State level handball competitions) ఎంపికయ్యాడు. కోహెడ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న రిశ్విత్ పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు అరవింద్, ప్రవీణ్‌తో పాటు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు