ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
ముకరంపుర, నవంబర్ 24(విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని(Indiramma Family Insurance Scheme) సద్వినియోగం చేసుకోవాలని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రజలను కోరారు. కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ లో భాగంగా 16 వ డివిజన్ మల్కాపూర్ లో స్థానిక కార్పోరేటర్ కాంతాల జగన్ రెడ్డి మరియు స్థానిక నాయకులతో కలిసి పలు కాలనీలలో వాకింగ్ చేశారు.
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంలో నమోదు చేయించుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నమోదు చేయించుకోనివాళ్లను వార్డు ఆఫీస్ కు వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు.అవగాహన కల్పించడం కోసం కరపత్రాలు పంపిణీ చేశారు.
గతంలో మంజూరు చేసిన సుడా నిధులతో చేపట్టాల్సిన మురుగు కాలువ పనులను పరిశీలించి త్వరలో పనులు ప్రారంభిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ ఈశ్వర్ గౌడ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కాశిపాక శంకరయ్య,కాంతాల సందీప్ రెడ్డి,గంట రమ,దేవునూరి శంకర్,లంక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.