హత్య కేసులో నిందితుడి అరెస్ట్

24-11-2026 | 05:46pm

గంజాయి విషయంలో పాత కక్షలే హత్యకు కారణం.. బైక్ స్వాధీనం

బోధన్, నవంబర్ 24 (విజయక్రాంతి): నిజామాబాద్(Nizamabad district) రూరల్ మండలం కాలూర్ శివారులో జరిగిన కృష్ణకుమార్ హత్య కేసులో పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. సుబోధ్ కుమార్ (20) అనే యువకుడిని ఖానాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. పోలీసుల విచారణలో గంజాయి విషయంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని వెల్లడైనట్లు పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న మిగతా నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు.

మరిన్ని వార్తలు