బీజేపీ పాదయాత్రను విజయవంతం చేయాలి

01-11-2026 | 06:52pm

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్‌లాల్

వెంకటాపూర్, నవంబర్ 01 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వం, అరాచక పాలనకు వ్యతిరేకంగా, ఎన్నికల సంఘంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని, ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లో నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్‌లాల్(Jawaharlal Nehru) పిలుపునిచ్చారు.

నవంబర్ 2న హైదరాబాద్‌ లోని నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజాంజాహి మార్కెట్ ఎక్స్ రోడ్స్ వరకు నిర్వహించే పాదయాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు