భూపాలపల్లిని పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించాలి
రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్‌కుమార్
భూపాలపల్లి, నవంబర్ 01 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించి, పంటలు సాగు చేయలేక నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్‌కుమార్(CPI District Secretary Korimi Rajkumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భూపాలపల్లి రావి నారాయణరెడ్డి భవన్లో జి. సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం వరి సాగు చేయవద్దని సూచించడంతో పలువురు రైతులు సాగుకు దూరమై నష్టపోయారని తెలిపారు.
జిల్లాలో కేవలం ఆరు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని, మిగిలిన కరువు ప్రభావిత ప్రాంతాలను కూడా గుర్తించాలని కోరారు.ఈ నెల 6 నుంచి సీపీఐ బృందం కరువు ప్రభావిత మండలాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుంటుందని తెలిపారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పైండ్ల శాంతికుమార్, కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్‌కుమార్, క్యాతరాజ్ సతీష్, కొరిమి సుగుణ, కుడుదుల వెంకటేష్, జిల్లా సమితి సభ్యులు మామిడాల సమ్మిరెడ్డి, పరమాండ్ల రాజయ్య, జి. శ్రీనివాస్, నిమ్మల రాజయ్య, గుంటి చంద్రమౌళి, పన్నాల కుమారస్వామి, తల్ల పోషం, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, గోలి లావణ్య తదితరులు పాల్గొన్నారు.