అండర్-19 క్రికెట్ జట్టుకు మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

01-11-2026 | 06:53pm

మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): మంచిర్యాల మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం MPC విద్యార్థి నితిన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా SGF అండర్-19 క్రికెట్ జట్టు(SGF Under-19 Cricket Team)కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెల 1, 2, 3 తేదీలలో మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి SGF అండర్-19 క్రికెట్ పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థి ఎంపికకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి నితిన్ ను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) అంజయ్య, SGF కార్యదర్శి బాబురావు, మంచిర్యాల మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్. సుదీప్ అభినందించారు.

మరిన్ని వార్తలు