రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు తూడుకుర్తి విద్యార్థులు
17-10-2026 | 09:33pm
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తూడుకుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు 45వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో నందిని, వైష్ణవి, పల్లవి, బాలుర విభాగంలో గౌస్ పాషా, నరహరి ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు మొల్ల సత్యనారాయణ, పీడీ రమేష్, ఉపాధ్యాయులు అభినందించారు.