నారాయణ పాఠశాలలో ఘనంగా ఎస్.ఎల్.సి. కార్యక్రమం
05-10-2026 | 10:08pm
జనగామ అక్టోబర్ 5 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాల(Narayana School)లో TERM-I విద్యార్థుల నేతృత్వ సమావేశం (SLC) ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా e-Kidz ఆర్&డీ సంగీత, జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ అభ్యాస ప్రగతిని స్వయంగా తల్లిదండ్రులకు వివరించడం వల్ల వారిలో మాట్లాడే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. విద్యార్థుల కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫర్హానా, కోఆర్డినేటర్ శిరీష, ఏవో చారి, ఇన్చార్జ్ మమత, తల్లిదండ్రులు పాల్గొన్నారు.