సఖి సురక్షిత పై మహిళ సంఘాలకు అవగాహన సదస్సు
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 28విజయక్రాంతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో విజయపురికాలనీ గ్రామంలో సఖి సురక్షతపై స్వయం సహాయక సంఘాల వారికి అవగాహన సదస్సు(Sakhi Surakshita Awareness Program) నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు మహిళా శిషు సంక్షేమ డిపార్ట్మెంట్ లోని జిల్లా మహిళా సాధికారత కేంద్రం నుండి జెండర్ స్పెషలిస్ట్ లు స్వప్న, స్రవంతి సఖి కేంద్రం నుండి సైకో సోషల్ కౌన్సిలర్ M. కల్పన.
కాఫెడ్ స్వచ్చంధ సంస్థ డైరెక్టర్ లూర్థు రాజు పాల్గొన్నారు. స్వప్న మాట్లాడుతూ మన జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక చోట బాలికలు, స్త్రీలు ఎదుర్కోంటున్న వివిధ రకాల హింసల నుండి రక్షణ కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన కేంద్రమే సఖి సెంటర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలు, బాలికల కొరకు రక్షణ కవచంగా 181 హెల్ప్ లైన్ షి టీమ్స్, డివిసెల్ లాంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసి బాలికలు, మహిళ రక్షణకు భరోసా కల్పిస్తున్నది.
గత 20 సంవత్సరాలుగా స్త్రీలు, బాలికల హక్కుల కోసం పనిచేస్తున్న సఖి సురక్షిత కేంద్రాలు ప్రస్తుత సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వేధింపులు, గృహ హింసల నుండి రక్షణ కల్పించడానికి వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి సఖి సెంటర్ కృషి చేస్తుంది.
గృహ హింస, పని చేసే చోట లైంగిక వేధింపులు, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణ, విద్యా సంస్థలలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు మొదలగు హింసల నుండి రక్షణ కల్పించడము, వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఒకే చోట నుండి అందించడం సఖి సెంటర్ ప్రత్యేకత,
ఈ సేవలన్నింటిని అందించడానికి సఖి సెంటర్లో పూర్తి స్థాయి నైపుణ్యం కలిగిన సిబ్బంది 24 గంటలు, 7 రోజులు అందుబాటులో ఉంటారు. ఒకసారి బాధిత స్త్రీ సఖి సెంటరకు వస్తే సఖి సెంటర్ అన్ని వేళలలోను ఆమెకు తోడుగా ఉంటుంది.
అని తెలియ చేశారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్ ,వెంకటాపురం యాని మేటర్స్ నరేష్, ప్రశాంత్, ఉష, ఇందిరా, పద్మ, స్వయం సహాయక సంఘాలు సభ్యులు పాల్గొన్నారు.