శ్రీ హేమాచల లక్ష్మీనృసింహకి కానుకలు సమర్పణ

24-11-2026 | 05:27pm

మంగపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా(Yadagiri Gutta) ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో(Temple of Lakshmi Narasimha Swamy) మంగళవారం భక్తులు విలువైన కానుకలు సమర్పించారు.

మంగపేటకు చెందిన పెన్మెత్స కృష్ణమూర్తి రాజు రమాదేవి దంపతులు స్వామి వారికి 90 వేల రూపాయలు విలువ కలిగిన ఇత్తడి కానుకల హుండీని సమర్పించారు. మల్లూరుకు చెందిన గోళ్ళమూడి చంద్రశేఖరావు - హరిష దంపతులు స్వామి వారికి 10 వేల రూపాయలు విలువ కలిగిన 2 ఇత్తడి దీవిటీలు (కాగడాలు) సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు