గోదావరిలో పడి ఆరేళ్ల బాలుడి మృతి

08-10-2026 | 06:30pm

వాజేడు అక్టోబర్ 8 (విజయ క్రాంతి): వాజేడు మండలం పూసూరుకు చెందిన ఆరేళ్ల బాలుడు గోదావరి నదిలో(Godavari River) పడి మృతి చెందాడు. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేశ్ కుమారుడు హేమంత్(6) స్థానిక పాఠశాలలో మొదటితరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం తోటి స్నేహితులతో కలిసి గోదావరి వైపు బహిర్భూమికి వెళ్లగా, గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు,తోటి స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని బయటకు తీశారు.

మరిన్ని వార్తలు