నాణ్యమైన విద్యుత్ అందించాలి
విజయక్రాంతి ఎఫెక్ట్
ఏటూరునాగారం డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): కన్నాయిగూడెం మండల(Kannaigudem Mandal) ప్రజలకు నాణ్యమైన కరెంటును అందించాలని ఏటూరునాగారం డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం సిబ్బందిని ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మండలంలో అనధికారిక విద్యుత్ కోతలు అనే కథనాన్ని విజయక్రాంతి దినపత్రికలో మంగళవారం రోజున ప్రచురించారు. కథనంపై బుధవారం రోజున స్పందించిన సీఎండీ, ములుగు సూపరిండెంట్ ఇంజనీర్ బిక్షపతి ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు, కన్నాయిగూడెం సబ్ స్టేషన్లను ఏటూరునాగారం డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం(Eturunagaram Division Engineer Purushottam) బుధవారం రోజున తనిఖీ చేశారు.
అనంతరం అయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో టీజీఎన్పీడీసీఎల్(TGNPDCL) మీద అధిక భారం పడుతుందని, సిబ్బంది త్రీ ఫేస్ కరెంటు ఉన్న సమయాల్లో అత్యవసర పరిస్థితిలో తప్ప ఎల్సీ (లైన్ కట్ ) చేయకూడదని ఆదేశించారు. కన్నాయిగూడెం, ఏటూరు సబ్ స్టేషన్లల్లో ఎంత వరకు లోడ్ పడుతుందో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, కరెంటు కటింగ్ అటెండన్స్ బుక్ ను పరిశీలించారు. కన్నాయిగూడెం, ఏటూరు సబ్ స్టేషన్ల పరిధిలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి రైతులకు అందుతున్న విద్యుత్ గురించి ఆరా తీశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.