కబడ్డీ కూతకు క్రీడాకారుల సై!

23-09-2026 | 05:14pm

జిల్లా స్థాయి ఎంపికల్లో 100 మంది ప్రతిభాపాటవాలు.. రాష్ట్ర పోటీలకు 24 మంది ఎంపిక

పాపన్నపేట: రాష్ట్రా స్థాయి కబడ్డీ పోటీలకు, క్రీడాకారులు సిద్ధమయ్యారు. మెదక్ జిల్లా(Medak District) పాపన్నపేట మండల కేంద్రంలో బుధవారం జిల్లా స్థాయి జూనియర్, సబ్‌ జూనియర్ కబడ్డీ ఎంపిక పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మంది బాలబాలికలు ఈ ఎంపికల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఎంపిక పోటీలను పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్(Papannapet SI Srinivas Goud), స్థానిక సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, హెచ్‌ఎం మహేశ్వర్ ప్రారంభించారు. క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతూ తమ సత్తా చాటుకున్నారు.

రాష్ట్రస్థాయికి 24 మంది

ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 20 ఏళ్లలోపు బాలబాలికల నుంచి 24 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పాపన్నపేట ఫిజికల్ డైరెక్టర్ రమేష్(Papannapet Physical Director Ramesh) తెలిపారు. సిరిసిల్లలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వీరు మెదక్ జిల్లా తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు