జిఎంఆర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకోలు

23-09-2026 | 05:19pm

పటాన్ చెరు, సెప్టెంబర్ 23: సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) ఆధ్వర్యంలో పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్ చెరు నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికైన 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిఎంఆర్ మాట్లాడుతూ.. నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు