మార్కెట్లకు మళ్లీ లాభాల జోష్

23-09-2026 | 04:19pm

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) బుధవారం లాభాల బాట పట్టాయి. అమెరికా-ఇరాన్‌ చర్చలపై పెరిగిన ఆశలు, బ్యారెల్‌ చమురు ధరలు 100 డాలర్ల వద్ద స్థిరపడటం మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సెన్సెక్స్‌ 299.17 పాయింట్లు ఎగబాకి 74,828.25 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 117.80 పాయింట్లు లాభపడి 23,446.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ దూసుకెళ్లాయి.

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా జోరు చూపించాయి. ముఖ్యంగా మెటల్‌ రంగం 2 శాతానికి పైగా లాభపడగా.. ఎఫ్‌ఎంసీజీ రంగం సైతం మెరుగైన పనితీరు కనబరిచింది. అయితే ఐటీ రంగం మాత్రం మార్కెట్‌ ర్యాలీలో వెనుకబడింది.


మరిన్ని వార్తలు