మెడికల్ కాలేజీలో సీటు సాధించిన ఆదివాసి గిరిజన బిడ్డ..

23-09-2026 | 05:22pm

ఉట్నూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఉట్నూర్ మండలం(Utnoor Mandal) హస్నాపూర్ పంచాయతీ పరిధిలోని శ్యామ్ నాయక్ తండాకు చెందిన జాదవ్ వైష్ణవి ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటారు. ఇటీవలే విడుదలైన నీట్ ఫలితాల్లో(NEET results) ఆమె జాతీయ స్థాయిలో ఎస్టి కేటగిరీలో 413 మార్కులు సాధించారు. ఈ ప్రతిభ ఆధారంగా  ప్రముఖ మెడికల్ కాలేజీలో వైష్ణవికి ఎంబీబీఎస్ సీటు లభించింది. 

ఈమె తండ్రి జాదవ్ వినోద్ (పీడీ) మరియు తల్లి నికిత దంపతుల కుమార్తె. ఒక సాధారణ ఆదివాసి గిరిజన కుటుంబం నుంచి వచ్చి, కష్టపడి చదివి ఈ స్థాయి ర్యాంకు సాధించడం పట్ల తెలంగాణ గిరిజన టీచర్స్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంత బిడ్డ వైద్య విద్యలో ఇంతటి ఘనత సాధించడం యావత్ గిరిజన సమాజానికే గర్వకారణమని పేర్కొంటూ, తేజస్వికి మరియు ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు