ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
జుక్కల్, నవంబర్ 23 (విజయక్రాంతి) : జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Baswapur Gram Panchayat Office) ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా ఆన్లైన్(Indiramma Family Life Insurance Online) కార్యక్రమం కొనసాగుతుందని సర్పంచ్ రమణ సురేష్ తెలిపారు.
గత రెండు రోజుల నుంచి కేవలం 182 మాత్రమే ఆన్లైన్ చేయడం జరిగిందని, మిగిలిన 391 ఇంకాను ఆన్లైన్ భీమా చేసుకోలేదన్నారు. కావున రేపు ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతుంది కావున మిగిలిన వారు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి ఆన్లైన్ కుటుంబ భీమా పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామ కార్యదర్శి జి పి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. ఏ అవకాశాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.