సమవర్తి కథాంశానికీ మా ఊరికీ దగ్గరి పోలిక

20-09-2026 | 05:25am

సత్యదేవ్(Satyadev) హీరోగా నటిస్తున్న 16వ చిత్రం ‘సమవర్తి(Samavarthy)’. ఈ సినిమాను అజయ్‌నాగ్ వీ దర్శకత్వంలో శివచరణ్‌రెడ్డి జక్కిడి, శశిధర్‌రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. గణవి లక్ష్మణ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌(Ecological action thriller)లో శ్రీకాంత్, దిలీప్ పోతన్, రాజీవ్ కనకాల, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానున్న ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “సమవర్తి’ లాంటి బ్యూటిఫుల్ మూవీ నాకు దక్కడం సంతోషంగా ఉంది. దక్షిణ భారత్‌లో ఎన్ని అడవులు ఉన్నాయో అన్నింట్లో మేము షూటింగ్ చేశాం. మాకొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది” అన్నారు. కథానాయకి గానవి లక్ష్మణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నటించాలని బలంగా కోరుకున్నా. మాది చిక్ మంగళూరు ప్రాంతం. చుట్టూ అడవులతో, జంతువులతో ఉన్న అందమైన ప్రదేశం. అడవి, అక్కడి నుంచి వచ్చే జంతువులతో మా ప్రాంతంవాళ్లు ఎదుర్కొన్న అనుభవాలను మా నాన్న కథలుగా చెప్పేవారు.

హ్యూమన్, నేచర్ వంటి అంశాలు ప్రధానంగా ఉన్న ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది” అని తెలిపింది. డైరెక్టర్ అజయ్ నాగ్ మాట్లాడుతూ.. “సత్యదేవ్‌కు ఒక థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘సమవర్తి’తో ఇవ్వబోతున్నాం. ప్రొడ్యూసర్స్ సహకారం వల్లే ఇంత భారీగా సినిమాను రూపొందించగలిగాం. కథలో చాలా కీలకంగా ఉండే పాత్రను అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశారు హీరోయిన్ గానవి లక్ష్మణ్‌” అని తెలిపారు. నిర్మాత శశిధర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా థియేటర్లలో మ్యాజిక్ చేయబోతోంది.

తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్చేసే చిత్రమిది” అన్నారు. ‘మా సినిమా పెద్ద హిట్ అవుతుంది. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరి కెరీర్‌లో గుర్తుండిపోయే విజయం సాధిస్తుంది’ అని నిర్మాత శివచరణ్‌రెడ్డి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమలో నటులు మోహన్ భగత్, శ్రీకాంత్, డీవోపీలు హర్ష మల్లికార్జున, దేవ్ దీప్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఎడిటర్ ఆదిత్య, క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినయ్‌రెడ్డి కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు