గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన మాజీమంత్రి...
జహీరాబాద్, సెప్టెంబరు 20 (విజయక్రాంతి): ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఈ చంద్రశేఖర్(Congress Party In-charge Dr. Chandrasekhar) అన్నారు. ఆదివారం రాత్రి జహీరాబాద్ లో నెలకొల్పిన గణేశుని మండపాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ గణేష్ ని ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ప్రతిరోజు అన్నదానాలు వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు భక్తి మార్గం వైపు తీసుకువెళ్లడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో భాజా భజంత్రీలతో భక్తి శ్రద్ధలతో పూరియంపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నిమజ్జన కార్యక్రమంలో గణేష్ మండపాల నిర్వహకులు శాంతియుతంగా అధికారులు పోలీసులు చెప్పిన విధంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది కలగదని శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవడం జహీరాబాద్లో అన్ని కుల మతాలవారు ఒకరికొకరు సహకరించుకొని గణేష్ని యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం మానవాహిక వస్తుందని ఆయన తెలిపారు.