బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం

20-09-2026 | 10:35pm

రామచంద్రపురం: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్(Tellapur Division) పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో బాల గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ వద్ద సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాదం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు ప్రేమ్, మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ మాట్లాడుతూ గత 35 సంవత్సరం నుండి బొడ్రాయి దగ్గర గణేష్ పెట్టడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో పూజిస్తాం బజనలు చేస్తాం అని ఆ వినాయకుడు ఆశీస్సులతో ప్రతి సంవత్సరం అన్న ప్రసాదాలు పెట్టి ఆ గణేశుని ఆశీర్వాదం తీసుకొంటున్నాం అందరిపై ఘననాధుడి ఆశీర్వాదం ఉండాలనీ చల్లగా చూడాలని కోరుతున్నాం అని అన్నారు.

మరిన్ని వార్తలు