వినోబానగర్ లో విషాదం

20-09-2026 | 10:58pm

కారులో చిక్కుకొని చిన్నారి మృతి 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) జూలూరుపాడు మండలం వినోబానగర్ లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కారులో చిక్కుకొని డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. వినోబానగర్ సర్పంచ్ గంగావత్ రవి కూతురు తన్విత ఆడుకుంటూ ఇంటి ముందున్న కార్లోకి వెళ్లి కూర్చుంది. కార్ డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. చాలాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూసేవారికి తన్విత అప్పటికే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారువినోబానగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు